: మోడీ ప్రమాణస్వీకార వేడుకకు రూ. 17.60 లక్షల ఖర్చు
దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ మే 26న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఫోర్ కోర్టులో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు దేశాధినేతలు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఇతరులు హాజరయ్యారు. ఓ వేడుకగా నాడు జరిగిన ఈ కార్యక్రమానికి అక్షరాలా రూ. 17.60 లక్షల ఖర్చు అయిందని సమాచార హక్కు ఇచ్చిన సమాధానంలో తెలిసింది. సామాజిక కార్యకర్త రమేష్ వర్మ సమాచార హక్కు కింద పైవివరాలు తెలుసుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన ఏర్పాట్లు, హాజరైన 4,017 మంది అతిథులు, వారికోసం ఏర్పాటు చేసిన టెంట్స్, స్టేజ్, ఫర్నీచర్, ఇతరాల కింద దాదాపుగా అంత ఖర్చు చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అయితే, ఫంక్షన్ వారీగా జరుగుతున్న వ్యయం కోసం ఎలాంటి రికార్డులు నిర్వహించడంలేదని చెప్పింది.