: ఢిల్లీలో ఎన్నికలకు ఆమ్ ఆద్మీ డిమాండ్... లెఫ్టినెంట్ గవర్నర్ ను కలసిన కేజ్రీవాల్
ఢిల్లీలో ఎలాగయినా ఎన్నికలు నిర్వహింపజేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తెగ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. అనంతరం ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశంలేదని గవర్నర్ కు చెప్పామన్నారు. మళ్లీ తాజాగా ఎన్నికలు జరపాలని కోరినట్లు చెప్పారు. దీనిపై బీజేపీని సంప్రదిస్తానని, అటు రాష్ట్రపతితో కూడా మాట్లాడి ఓ నివేదిక అందిస్తానని గవర్నర్ చెప్పినట్లు సిసోడియా వివరించారు.