: యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తోన్న 'జెంటిల్మన్'
ఒకే ఒక్క పాటతో మ్యూజిక్ చార్ట్ లను షేక్ చేసిన దక్షిణ కొరియా గాయకుడు సై తాజా సింగిల్ 'జెంటిల్మన్' కూడా యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. సైకి ప్రపంచవ్యాప్త క్రేజ్ తెచ్చిపెట్టిన 'గాంగ్నమ్ స్టయిల్' రికార్డులను జెంటిల్మన్ తిరగరాస్తోంది. రెండ్రోజుల క్రితం నెట్టింట్లోకి వచ్చిన ఈ గీతం ఒక్క సోమవారం రోజే 4.4 కోట్ల హిట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇంతకుముందు 'గాంగ్నమ్ స్టయిల్' ను ఒక్కరోజులో 80 లక్షల మంది చూడడమే ఇప్పటి వరకు యూట్యూబ్ రికార్డుగా ఉంది. అప్పట్లో గాంగ్నమ్.. పాట ఓవరాల్ గా 152 కోట్ల మంది చూశారట. తాజా సింగిల్ ఆ రికార్డునూ బద్ధలు కొట్టడం ఖాయమని సంగీత పరిశ్రమ అంటోంది.