: విద్యుత్ షాక్ తో రైతు దంపతులు మృతి
విజయనగరం జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పొలం పనుల్లో నిమగ్నమైన ఓ రైతు దంపతులను విద్యుత్ షాక్ బలి తీసుకుంది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం తమరకంది గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పొలానికెళ్లిన రైతు దంపతులు, విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.