: పట్టు వీడని ఓయూ విద్యార్థులు
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన అంశంపై ఆందోళనకు దిగిన ఉస్మానియా విద్యార్థులు ఆదివారం కూడా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఆదివారం నాటి ఆందోళనలో భాగంగా తార్నాక వైపు దూసుకెళుతున్న విద్యార్థులను పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే, ఖాళీ పోస్టులన్నీ భర్తీ కావడంతో తమకు అసలు ఉద్యోగాలే దక్కని స్థితి నెలకొనే ప్రమాదముందని ఓయూ విద్యార్థులు భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు కేసీఆర్ సంసిద్ధతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.