: కెప్టెన్ ధోనీ ఔట్, భారత్ కు 179 ఆధిక్యం
ఇంగ్లండ్ తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్లంకెట్ బౌలింగ్ లో బెల్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మరోవైపు మురళీ విజయ్ 82 పరుగులతో విరోచిత పోరు సాగిస్తుండగా, ధోనీ పెవిలియన్ చేరడంతో బిన్నీ, విజయ్ కి జతకలిశాడు. ప్రస్తుతం 203/5 పరుగుల వద్ద ఆట కొనసాగిస్తున్న భారత్ కు 179 పరుగుల ఆధిక్యం లభించింది.