: ’మలేసియా‘ మృత దేహాలను తిరుగుబాటు దారులు తీసుకెళ్లారు: ఉక్రెయిన్


మలేసియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను తిరుగుబాటు దారులు తీసుకెళ్లారని ఉక్రెయిన్ తెలిపింది. ప్రమాదంలో మరణించిన 196 మంది మృతదేహాలను తిరుగుబాటు దారులు తీసుకెళ్లినట్లు ఆ దేశ అత్యవసర సేవల విభాగం తెలిపింది. మృతదేహాలను తిరుగుబాటుదారులు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తమకు అంతుచిక్కడం లేదని ఆ శాఖ పేర్కొంది. విమాన ప్రమాదం తర్వాత మృతదేహాలను తిరుగుబాటుదారులు ట్రక్కుల్లో ఎక్కిస్తుండటాన్ని అసోసియేటెడ్ ప్రెస్ విలేకరులు కూడా చూసినట్లు సమాచారం. తిరుగుబాటుదారులు తీసుకెళ్లగా మిగిలిన మృతదేహాలను ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం స్వాధీనం చేసుకుంది.

  • Loading...

More Telugu News