: తమిళ నటుడు దండపాణి మృతి


తమిళ సినీరంగం మరో సీనియర్ నటుడిని కోల్పోయింది. తమిళంతో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన దండపాణి తిమిరమ్ పెసుతాడి ఆదివారం గుండెపోటుతో చెన్నైలో మరణించారు. కన్నడ చిత్రాల్లోనూ నటించిన దండపాణి 'కాదల్' చిత్రంతో ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకున్నారు. 'ప్రేమిస్తే' అనువాద చిత్రం, ఇంకా 'కృష్ణ', 'ఆంజనేయులు' వంటి సినిమాల ద్వారా ఈయన తెలుగు వారికి సుపరిచయుడే! దండపాణి మరణం పట్ల తమిళ సినీరంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన 'సందమారుతం' చిత్రంలో దండపాణి నటిస్తున్నారని, ఆయన ఆదివారం మృతి చెందారని ప్రముఖ నటుడు శరత్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News