: డబుల్ అయిన కేబీఆర్ పార్క్ ఎంట్రీ ఫీజు
సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కు వెళ్లే కేబీఆర్ పార్క్ ఎంట్రీ ఫీజును పెంచారు. ఇప్పటివరకు కేబీఆర్ పార్క్ ఎంట్రీ ఫీజు కింద ఏడాదికి 800 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇకపై ఏడాదికి 1500 రూపాయలు వసూలు చేయనున్నారు. కేబీఆర్ పార్క్ ఫీజును పెంచుతు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.