: కూల్చివేతలపై కేసీఆర్ ను కలవనున్న గ్రేటర్ కార్పొరేటర్లు


హైదరాబాద్ లో అక్రమ కూల్చివేతలపై టీడీపీ, బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేసీఆర్ అపాయింట్ మెంట్ గురించి గ్రేటర్ కార్పొరేటర్లు ప్రయత్నిస్తున్నారు. అక్రమ కూల్చివేతలు వెంటనే ఆపాలని కేసీఆర్ ను గ్రేటర్ కార్పొరేటర్లు కోరనున్నారు. అక్రమ కూల్చివేతలపై నిన్ననే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ను కార్పొరేటర్లు కలిశారు. ఈ విషయంపై ఆయన చేతులెత్తేయడంతో... కార్పొరేటర్లు కేసీఆర్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. అక్రమ కూల్చివేతలపై స్థానిక ప్రజల నుంచి గ్రేటర్ కార్పొరేట్లర్లపై బాగా ఒత్తిడి పెరిగిందని సమాచారం.

  • Loading...

More Telugu News