: సొంత నియోజకవర్గంపై నేడు మోడీ సమావేశం
లోక్ సభ ఎన్నికల్లో తనకు ఘన విజయాన్ని కట్టబెట్టిన వారణాసి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టి సారించారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు సెవెన్, రేస్ కోర్సు రోడ్డులోని తన అధికారిక నివాసంలో వారణాసి మేయర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. వారణాసి మురుగునీరు, ట్రాఫిక్ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం.