: పోలవరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర


పోలవరం బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదించడంతో పోలవరం బిల్లు చట్టంగా మారుతుంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న సుమారు 215 గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ తీసుకొచ్చిన ఈ బిల్లుకు పార్లమెంట్ గత వారం ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ముంపుకు గురవుతున్న ప్రజల పునరావాసం కోసం ఈ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలపాలని కేంద్రంలోని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News