: రహానే ప్రదర్శనకు ముచ్చటపడిన 'లార్డ్ ఆఫ్ లార్డ్స్'
లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మన్ అజింక్యా రహానే కనబరిచిన పోరాటపటిమ భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ ను ఎంతగానో ఆకట్టుకుంది. మిగతా బ్యాట్స్ మెన్ తో కలిసి రహానే ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు అమోఘమని కొనియాడాడు. భారత క్రికెటర్ల అత్యుత్తమ ఇన్నింగ్స్ లలో ఇది ఒకటని అభివర్ణించాడీ 'లార్డ్ ఆఫ్ లార్డ్స్'. అలనాటి భారత క్రికెటర్లలో అగ్రగామి బ్యాట్స్ మన్ గా మన్ననలందుకున్న వెంగీ ఇంగ్లండ్ గడ్డపై సాధించిన మూడు సెంచరీలకు లార్డ్స్ మైదానమే వేదిక. అందుకే ఈ స్టయిలిష్ బ్యాట్స్ మన్ ను 'లార్డ్ ఆఫ్ లార్డ్స్' గా పిలుచుకుంటారు.