: కడప జిల్లాలో ఎంఈవోపై విద్యార్థుల దాడి


కడప జిల్లాలోని బోయనపల్లెలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, పరిస్థితిని గమనించేందుకు అక్కడికి వచ్చిన ఎంఈవోపై విద్యార్థులు దాడికి దిగారు. కాగా, ఓ ఉపాధ్యాయుడు తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఓ విద్యార్థిని చెప్పడంతో అతగాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News