: అది రష్యా అనుకూల వర్గాల పనే: ఒబామా


మలేసియా విమానాన్ని కూల్చివేసింది రష్యా అనుకూలవర్గానికి చెందినవారేనని భావిస్తున్నామని అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులతోనే ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తీవ్రవాదులు ఈ మారణకాండకు పాల్పడ్డారని ఆయన శుక్రవారం చెప్పారు. ఉక్రెయిన్ ను రష్యాలో విలీనం చేయాలన్న డిమాండ్ తో ఉన్మాదులుగా వ్యవహరిస్తున్న వేర్పాటువాదులపై రష్యా మెతక వైఖరి అవలంబించడం సబబు కాదని కూడా ఈ సందర్భంగా ఒబామా వ్యాఖ్యానించారు. ఈ తరహా దాడులు జరిగిన సమయంలోనైనా వారిని కట్టడి చేయని పక్షంలో వారు ప్రపంచానికి మరింత మేర చేటు చేసేందుకు కూడా వెనుకాడబోరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News