: జగన్ ను వేరే రాష్ట్రంలోని జైలుకి పంపాలి- వీహెచ్
అవినీతి కేసులో అరెస్టయి, చంచల్ గూడా జైలులో వున్న జగన్ ను వేరే రాష్ట్రంలోని జైలుకు పంపాలని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఇప్పటికే చంచల్ గూడా జైలు వైసీపీ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంచితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆయన ఓ సూచన చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆలోచనలను కిరణ్ ఆచరించాలన్నారు. ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా ఆ రోజు (2జీ కేసులో) డీఎంకే నేతలపై కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టిందని వీహెచ్ గుర్తు చేశారు. అలాగే మంత్రి పదవులకు ఎవరు రాజీనామా చేసినా వాటిని సీఎం అంగీకరించాలని సలహా ఇచ్చారు. మంత్రుల రాజీనామాలు అంగీకరించకపోతే ప్రజలు అపార్ధం చేసుకుంటారని చెప్పారు.