: సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంజయ్ దత్
ముంబయి వరుస పేలుళ్ళ కేసులో, లొంగిపోయేందుకు మరి కాస్త గడువు ఇవ్వాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సుప్రీం కోర్టును అభ్యర్థించాడు. ఈ కేసులో సుప్రీం, సంజయ్ దత్ కు ఐదేళ్ళ జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 18లోగా కోర్టు ఎదుట లొంగిపోవాలని కూడా తీర్పు సమయంలో అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో తనకు మరికొన్ని వారాల గడువు కావాలని సంజయ్ దత్ అంటున్నాడు. ప్రస్తుతం ఈ వెటరన్ హీరో పలు చిత్రాలతో బిజీగా ఉండడమే అందుకు కారణం. ఆ ప్రాజెక్టుల విలువ రూ. 70-100 కోట్లు ఉండవచ్చని అంచనా. కాగా, సంజయ్ దత్ విన్నపం పట్ల సుప్రీం రేపు విచారణ జరపనుంది.