: కేసీఆర్ ను కలిసిన అమెరికా వాణిజ్య శాఖ సహాయ కార్యదర్శి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అమెరికా వాణిజ్య శాఖ సహాయ కార్యదర్శి అరుణ్ కుమార్ కలిశారు. హైదరాబాదులో ఈ ఏడాది జరిగే ఇండో-అమెరికన్ సదస్సు గురించి చర్చించినట్టు తెలిసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన షెడ్యూల్ లో హైదరాబాదును కూడా చేర్చాలని అరుణ్ కుమార్ ను ముఖ్యమంత్రి కోరారు. ఈ భేటీ అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాదు భూకంప రహిత ప్రాంతమని, పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమమైందని చెప్పినట్లు తెలిపారు. వైమానిక, రక్షణ రంగాల్లో పెట్టుబడికి అమెరికా ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.