: తిరుమల ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం సంభవించింది. ఘాట్ రోడ్డులోని 35వ మలుపు వద్ద మంటలు చెలరేగాయి. ఘాట్ రోడ్డు సమీపంలో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.