: తాప్సీ సిగరెట్ల కథ!


'పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అన్నారు కన్యాశుల్కంలో గిరీశం మాస్టారు. మాస్టారి హితబోధతో జ్ఞానోదయమైందో ఏమో కానీ తాప్సీ 'అయ్యబాబోయ్ నేను రోజుకి 100 సిగరెట్లు తాగుతున్నానా?' అంటూ ఆశ్చర్యపోయింది. ఇంతకీ ఆమె తాగుతోంది సిగిరెట్లను కాదు... ముంబైలో గాలిని! ఉబెర్ ఫాక్ట్స్ చెబుతున్న లెక్కల ప్రకారం ముంబైలో ఉంటున్న జనం ఒకరోజు పీల్చే కాలుష్యం వంద సిగరెట్లతో సమానమట. టాలీవుడ్, కోలీవుడ్ లో అవకాశాలు సంపాదించడంలో వెనుకబడ్డ తాప్సీ ముంబైలో మకాం వేసింది. తాజాగా రెండు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న ఈ భామ 'తాను నాన్ స్మోకర్ అని తెగ సంబరపడిపోయేదానినని, ఉబెర్ ఫాక్ట్స్ చెప్పిన లెక్కల ప్రకారం తాను కూడా స్మోకర్ నేనని అర్థమైందని' ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News