: గుర్తింపు కోసం ఎన్నికల కమిషన్ కు జనసేన దరఖాస్తు
నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు తెలుపుతూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తమను సంప్రదించాలని కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేయించుకోదల్చిన వారు ముందుగా బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పవన్ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.