: పెరిగిన గోదావరి నీటిమట్టం... సముద్రంలోకి వృథాగా 36వేల క్యూసెక్కుల నీరు
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నదిలో నీటి మట్టం పెరిగింది. నీటిమట్టం పెరగడంతో కాటన్ బ్యారేజ్ లోని 175 గేట్లను ఎత్తివేశారు. గేట్లు ఎత్తివేయడంతో 36 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలవనుంది.