: వామపక్ష తీవ్రవాదం ఆమోదయోగ్యం కాదు: వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ ఉదయం హైదరాబాదు జాతీయ పోలీసు అకాడమీలో డిజిటల్ క్రైం రిసోర్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం ఆమోదయోగ్యం కాదని అన్నారు. సరిహద్దు తీవ్రవాదం దేశానికి అతిపెద్ద సవాలు అని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మరింత మెరుగైన శిక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక, మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.