: 'బుక్' క్షిపణి... విమానాన్ని కూల్చింది ఇదేనా..?
ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో మలేసియా విమానం కూలిపోవడంపై యావత్ ప్రపంచం షాక్ కు గురైంది. అయితే, ఈ విమానం కూలిపోవడానికి తిరుగుబాటుదారుల క్షిపణి దాడే కారణమని తెలుస్తోంది. కాగా, ఈ ప్లేన్ ను కూల్చడానికి తిరుగుబాటుదారులు 'బుక్' మిస్సైల్ ను వినియోగించారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. 'బుక్'... షార్ట్ రేంజి (11-25 కి.మీ) క్షిపణి అయినా, గగనతల లక్ష్యాలను ఛేదించడంలో దిట్ట. తిరుగుబాటుదారులకు మిస్సైళ్ళు తయారుచేసుకునే సామర్థ్యం లేదని, రష్యానే వారికి సరఫరా చేసి ఉంటుందని ఉక్రెయిన్ వర్గాలు అంటున్నాయి. 1979 నుంచి రష్యన్ దళాలు ఈ మిస్సైల్ ను వినియోగిస్తున్నాయి.