: విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ఉక్రెయిన్


ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో మలేసియా విమానం ఎంహెచ్ 17 కూలిపోవడంపై ఉక్రెయిన్ విచారణకు ఆదేశించింది. ఈ విమానం క్షిపణి కారణంగానే కూలిపోయిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ విమానంలో మొత్తం 295 మంది ఉన్నారు. వీరిలో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది. ఈ బోయింగ్ 777 విమానం ఆమ్ స్టర్ డామ్ నుంచి కౌలాలంపూర్ వెళుతుండగా కూలిపోయింది. ఘటనాస్థలిలో శవాలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూపరులను కలిచి వేసింది. కాగా, రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు కీలకస్థావరమైన దోనెత్స్క్ ప్రాంతంలోని షాక్తార్స్క్ పట్టణం వద్దకు రాగానే విమానంతో రాడార్ సంబంధాలు తెగిపోయాయి. అనంతరం కాసేపటికే రష్యా సరిహద్దుల్లోని గ్రాబోవో గ్రామ సమీపంలో విమానం కూలిపోయింది.

  • Loading...

More Telugu News