: వానలు లేవు... సాగు చేసేదెలా?


గుంటూరు జిల్లాలో వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో పంట సాగు చేసేదెలా? అని రైతులు డైలమాలో పడ్డారు. జిల్లాలో వరిసాగు చేయాలని భావించిన రైతులు వానల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలాఖరు వరకు వర్షాలు కురిస్తేనే... సాగు చేసేందుకు వీలవుతుందని అన్నదాతలు అంటున్నారు. జిల్లాలో పెదకూరపాడు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదవ్వగా, నూజెళ్లలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 35 మండలాల్లో ఇప్పటివరకు వాన జాడే లేదు. ఈ మండలాల్లో జీరో వర్షపాతం నమోదయినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, నెలాఖరులోగా వర్షాలు కురవకపోతే... ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అన్నదాతలు యోచిస్తున్నారు.

  • Loading...

More Telugu News