: తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు హాయిగా, ప్రశాంతంగా!


నిన్న మొన్నటి వరకు తిరుమల శ్రీవారి దివ్యరూపాన్ని దర్శించడానికి భక్తుల మధ్య తోపులాటలు, గొడవలు జరిగేవి. అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది ఆ దేవదేవుడి రూపాన్ని కనులారా కాసేపు కూడా చూడనివ్వకుండానే వెంటనే 'జరగండి జరగండి' అని అరుస్తూ హడావుడి చేసేవారు. దీనికి కారణం, ఇటీవల వరకు తిరుమల శ్రీవారి విగ్రహం ఎదుట కేవలం ఒక్క క్యూ లైన్ మాత్రమే ఉండేది. కేవలం ఒకే ఒక క్యూ లైన్ ఉండడం వల్ల శ్రీవారి దర్శనం అయ్యేటప్పటికి భక్తులకు బాగా అలసట, నీరసం వచ్చేవి. అయితే ఇటీవల కాలంలో తిరుమల శ్రీవారి దర్శనం ఎటువంటి ఇబ్బందులు, తోపులాటలు, గొడవలు లేకుండా జరుగుతోంది. టీటీడీ ఈవో గోపాల్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల భక్తులు శ్రీవారిని కాసేపు ఎక్కువగా... ప్రశాంతంగా దర్శించుకుంటున్నారు. టీటీడీ ఈవో గోపాల్ ఒక్క క్యూ లైన్ ను ఇప్పుడు మూడు లైన్లుగా చేశారు. శ్రీవారి విగ్రహం ఎదుట ఉన్న స్థలాన్ని ఇప్పుడు మూడు క్యూ లైన్లుగా మార్చారు ఈవో. ఈ మూడు క్యూ లైన్లను కూడా విభిన్నంగా... వివిధ ఎత్తుల్లో ఏర్పాటు చేశారు. మొదటి క్యూ లైన్ ను భూమి నుంచి 16 అంగుళాల ఎత్తులో ఏర్పాటు చేయగా... రెండో క్యూ లైన్ ను భూమి నుంచి 7 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. మూడో క్యూ లైన్ ను మాత్రం మూములు ఎత్తులోనే ఉంచారు. ఈ విధానాన్ని మే 29 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది టీటీడీ. మూడు క్యూ లైన్ల వల్ల భక్తులు శ్రీవారిని ప్రశాంతంగా, హాయిగా దర్శించుకోగలుగుతున్నారని ఈవో గోపాల్ అంటున్నారు.

  • Loading...

More Telugu News