: సీసీఎస్ నిధులు విడుదల చేయకుంటే ఉద్యమమే: టీ ఆర్టీసీ ఎంప్లాయీస్
ఉద్యోగుల సహకార రుణాలకు (సీసీఎస్) సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేయని పక్షంలో ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సర్కారుకు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రితో పాటు రవాణా శాఖ మంత్రిని కూడా వారు కలిశారు. ఈ సందర్భంగా సహకార రుణాల నిధులను విడుదల చేయకుంటే, ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.