: బెంగళూరులో ఆరేళ్ల బాలికపై పాఠశాల సిబ్బంది అత్యాచారం, రెండు రోజులుగా ఆందోళన


బెంగళూరులో ఓ ఆరేళ్ల చిన్నారిపై, సదరు బాలిక చదువుకుంటున్న పాఠశాల సిబ్బంది అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పు బెంగళూరులోని ఓ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అఘాయిత్యానికి పాల్పడ్డ ఇద్దరు జిమ్ ఇన్ స్ట్రక్టర్లను అరెస్ట్ చేశారు. అయితే పాఠశాలలో పిల్లల భద్రతపై బాధితురాలి తల్లిదండ్రులతో పాటు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనలతో ఎట్టకేలకు బయటకు వచ్చిన పాఠశాల కరస్పాండెంట్ పిల్లల భద్రతకు సంబంధించి ఇకపై మెరుగైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాలలోని గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే, జరిగిన ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు పాఠశాల యాజమాన్యం యత్నిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే దాకా పోరాటం సాగిస్తామని బాలిక తండ్రి నీలేశ్ చెప్పారు.

  • Loading...

More Telugu News