: వైదిక్ ను ప్రశ్నించనున్న ఎన్ఐఏ?


జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ తో భేటీ కారణంగా జర్నలిస్టు, బాబా రామ్ దేవ్ అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ మరికొన్ని చిక్కులు ఎదుర్కునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముంబై దాడుల సూత్రధారిగా వ్యవహరించిన సయీద్ తో భేటీ అయిన వైదిక్ ను జాతీయ భద్రత సంస్థ (ఎన్ఐఏ) విచారించే అవకాశాలున్నట్లు కేంద్ర హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. "ముంబై దాడుల కేసును విచారిస్తున్న ఎన్ఐఏతో పాటు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు కూడా వైదిక్ ను ప్రశ్నించే అధికారం ఉంది. విచారణలో భాగంగా వైదిక్, సయీద్ తో ఏం మాట్లాడారు. అసలు ఐఎస్ఐ రక్షణలో ఉన్న సయీద్ ను కలిసేందుకు వైదిక్ కు అనుమతి ఎలా చిక్కింది, తదితర వివరాలను రాబట్టేందుకు ఎన్ఐఏ అధికారులు యత్నించే అవకాశాలున్నాయి. ముంబై పోలీసులు కూడా వైదిక్ కు సమన్లు పంపేందుకు సిద్ధమవుతున్నారు" అని హోంశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News