: బస్సు సర్వీసుల కొరతపై రోడ్డెక్కిన విద్యార్థులు


అవసరమైన మేరకు బస్సు సర్వీసులను నడపడం లేదని ఆరోపిస్తూ గురువారం మెదక్ జిల్లా పటాన్ చెరు డిపో ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన సమయంలో మెదక్ జిల్లాలో ఈ తరహా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే విద్యార్థుల కోసం ఆర్టీసీ అరకొర సర్వీసులనే తిప్పుతోంది. దీంతో మండిపడ్డ విద్యార్థులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆందోళనకు దిగారు. ఆర్టీసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News