: కాబూల్ ఎయిర్ పోర్టుపై టెర్రరిస్టుల మెరుపుదాడి


ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని విమానాశ్రయంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ ఉదయం రాకెట్లు, తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం ఎయిర్ పోర్టు కాల్పులతో హోరెత్తిపోతోంది. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. టెర్రరిస్టులు విమానాశ్రయానికి ఉత్తరభాగాన నిర్మాణంలో ఉన్న రెండు భవనాలను ఆక్రమించి ఈ దాడులకు దిగినట్టు ఆఫ్ఘన్ వర్గాలు తెలిపాయి. ఈ దాడి నేపథ్యంలో విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేశారు.

  • Loading...

More Telugu News