: తిరుమల కొండపై 8 మద్యం బాటిళ్లు స్వాధీనం


అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఉదయం, కొండమీద మహారాష్ట్ర కొల్హాపూర్ కు చెందిన ఓ టెంపో వాహనంలో ఎనిమిది మద్యం సీసాలు దొరికాయి. అయితే, తీసుకొచ్చిన వ్యక్తులు మాత్రం... తాము తిరుమలకు మొదటిసారి వచ్చామని, ఇక్కడ మద్య నిషేధం ఉన్న సంగతి తమకు తెలియదని అమాయకంగా చెప్పారు. ఈనేపథ్యంలో అలిపిరి వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీలపై సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలిపిరి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నప్పటికీ... మద్యం బాటిళ్లు, సిగరెట్లు, గుట్కాలు తదితరాలు యథేచ్ఛగా కొండపైకి చేరుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News