: హుస్సేన్ సాగర్ అలలపై సెయిలింగ్ పోటీలు షురూ!
హైదరాబాదు నడిబొడ్డునున్న హుస్సేన్ సాగర్ లో జరుగుతున్న జాతీయ లేజర్ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మంగళవారం ప్రారంభమైన ఈ పోటీలు రెండోరోజూ కొనసాగాయి. దేశవ్యాప్తంగా వివిధ క్లబ్బులకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. హైదరాబాదు బోట్స్ క్లబ్ నుంచి కూడా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. హుస్సేన్ సాగర్ అలలపై సర్రున దూసుకుపోతున్న చిన్న పడవలపై ఎగిరే తెరచాపలతో సాగర తీరంలో ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఈ పోటీలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో నగరవాసులు ట్యాంక్ బండ్ పైకి చేరుకున్నారు.