: హామీల అమలు విస్మరిస్తే నీ సంగతి చూస్తా: కేసీఆర్ కు ఎర్రబెల్లి హెచ్చరిక
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంగతి చూస్తానని టీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన ఎర్రబెల్లి, కేసీఆర్ పై ఆరోపణలు సంధించారు. అధికారం చేపట్టి నెల రోజులవుతున్నప్పటికీ, ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేసిన పాపాన పోలేదన్న ఎర్రబెల్లి, హామీలను అమలు చేయకపోతే కేసీఆర్ సంగతి తేలుస్తానంటూ వ్యాఖ్యానించారు.