: భారత్ లోనే మూడో వంతు పేదలు: ఐరాస నివేదిక


ప్రపంచంలోని పేదల్లో మూడో వంతు పేదలు భారత్ లోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. మిలీనియమ్ డెవలప్ మెంట్ గోల్స్ పేరిట ఐరాస రూపొందించిన నివేదికను బుధవారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా విడుదల చేశారు. భారత్ లో శిశు మరణాల రేటు కూడా అత్యధికంగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఐరాస నివేదిక అంశాలపై స్పందించిన హెప్తుల్లా, శిశు మరణాల రేటు తగ్గించడంతో పాటు పేదరిక నిర్మూలన దిశగా వేగవంతమైన చర్యలు చేపడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News