: సోమవారం నుంచి విశాఖలో ‘శ్రీవారి సేవలు’


తిరుమలలోనే కాదు... విశాఖలోనూ ‘వేంకటేశ్వర వైభవోత్సవాలు’ పేరిట శ్రీవారి సేవలు జరిపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీనివాసుని సేవలకు సంబంధించిన ఉచిత టిక్కెట్ల కౌంటర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఇవాళ ప్రారంభించారు. ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు విశాఖ నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని సేవలను విశాఖలోనూ నిర్వహించేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది. శ్రీనివాసుని వైభవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు టీటీడీ అధికారి భాస్కర్ తెలిపారు.

  • Loading...

More Telugu News