: స్వల్పకాలిక డిపాజిట్లపై ఎస్ బీఐ వడ్డీ కోత
స్వల్పకాలిక డిపాజిట్లపై (179 రోజులు) వడ్డీశాతాన్ని తగ్గిస్తున్నట్లు ఎస్ బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఈ డిపాజిట్లపై 0.5 శాతం వడ్డీ కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు ఇస్తున్న 7.5 శాతం వడ్డీ ఇక నుంచి 7 శాతం అవనుందని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన కొత్త వడ్డీ రేటు ఈ నెల 18 నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. అంతేగాక ఏడు నుంచి అరవై రోజుల వ్యవధి కలిగిన టర్మ్ డిపాజిట్లపైనా 0.25 శాతం వడ్డీ తగ్గించింది.