: చీనాబ్ నదిలో ట్యాక్సీ పడి ఎనిమిది మంది మృతి
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని చీనాబ్ నదిలో బుధవారం ఓ ట్యాక్సీ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. రాష్ట్రంలోని కిస్త్ వార్ జిల్లాలోని దాచెన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వాహనంపై డ్రైవర్ అదుపు కోల్పోయిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.