: 70 వేల కోట్ల రూపాయలతో తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న యనమల?
ఆగస్టులో జరిగే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టడానికి 2014-15 సంవత్సరానికి గాను బడ్జెట్ ను రూపొందించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఏపీ రాష్ట్ర తొలి బడ్జెట్ ఎలా ఉండాలన్న దానిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవసాయం, విద్య,ఆరోగ్యం తదితర శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరానికి మించి బడ్జెట్ ను రూపొందించవద్దని, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని సరైన ప్రణాళికలతో కూడిన బడ్జెట్ తయారు చెయ్యాల్సిందిగా యనమల రామకృష్ణుడు అన్ని విభాగాల అధికారులను కోరారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరగనున్న ఈ బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యనమల సూచన మేరకు అధికారులు దాదాపు 70 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సమాచారం.