: ఆడువారి నయనాలు పలికే భాష.. మగవారికి అర్థం కాదులే!


ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనే పాటను మగాళ్లు పాడారు తప్ప.. ఆడాళ్లు కాదు. అలాగే ఇప్పుడు 'ఆడాళ్ల కళ్లు పలికే భాష అసలు అర్థం కాదులే' అనే కొత్త పాట రాసుకోవాల్సిన పరిస్థితి. జర్మనీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం నిగ్గు తేలింది. మహిళల కళ్లలో ప్రతిఫలించే మనోభావాలను గుర్తించడం పురుషుల చేతకాదని జర్మనీ పరిశోధకులు తేల్చారు. ఇందుకు వారు 21-52 ఏళ్ల మధ్యగల పురుషుల మెదడు పనితీరును ఎమ్మారై స్కానింగ్‌ ద్వారా పరిశీలించారు. వారికి 36 జతల కళ్ల బొమ్మలు మాత్రమే ఉన్న ఫోటోలు చూపించారు. ఆ 36 ఫోటోల్లో స్త్రీ, పురుషులు ఇద్దరి కళ్లూ ఉన్నాయి. ఆ కళ్లు పలికే భావాలు గుర్తించాల్సిందిగా చెప్పారు. పురుషుల కళ్లున్న ఫోటోల్లో భావాల్ని గుర్తించారు గానీ.. మహిళల కళ్లలో ఉండే భావాల్ని గుర్తించలేకపోయారు. ఈ వ్యత్యాసాల్ని ఎమ్మారై స్కానింగ్‌ తేల్చడంతో పరిశోధకులు ఒక నిర్ణయానికి వచ్చారు.

  • Loading...

More Telugu News