: ఎంసెట్ కౌన్సెలింగ్ పై గవర్నర్ చర్చలు
జేఎన్టీయూ (హెచ్) వీసీ వేణుగోపాల్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ, ప్రవేశాలపై చర్చిస్తున్నారు. ఇంజినీరింగ్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో కౌన్సెలింగ్ ఆలస్యమవుతోందని, జోక్యం చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న (మంగళవారం) గవర్నర్ కు విన్నవించిన సంగతి తెలిసిందే.