: శ్రీకాళహస్తిలో చిన్నారుల అక్షరాభ్యాస వేడుకలు
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇవాళ చిన్నారుల అక్షరాభ్యాస వేడుకలను నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో... శ్రీగురు దక్షిణామూర్తి సన్నిధిలో చిన్నారుల సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ‘ఓం నమఃశివాయ’ నామాన్ని చిన్నారులతో రాయించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.