: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు: కేసీఆర్ కు కిషన్ రెడ్డి సూచన
ఫీజు రీయింబర్స్ మెంట్ పై టీ సర్కార్ వెంటనే స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సర్కార్ అలసత్వంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడరాదని కేసీఆర్ కు సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోవడంతో... విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. సమస్యను పరిష్కరించడానికి కేసీఆర్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారని... వెంటనే రుణాలను మాఫీ చేయాలని కోరారు.