: మరోసారి కోర్టుకు హాజరుకాని ధోనీ


హిందువుల మనోభావాలను గాయపరిచాడనే కేసులో ఈ రోజు టీమిండియా కెప్టెన్ ధోనీ అనంతపురం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ధోనీ ఇంగ్లండ్ టూర్ లో ఉండటంతో, అతని తరపు లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. ప్రముఖ ఆంగ్ల మాసపత్రిక బిజినెస్ టుడేలో విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోనీని ముద్రించారు. ఆ ఫొటోలో ధోనీ చేతిలో కూల్ డ్రింకులు, బూస్ట్ డబ్బా, బూటు తదితర వస్తువులు ఉంచారు. దీనిపై ఆగ్రహించిన విశ్వహిందూపరిషత్ అనంతపురం జిల్లా శాఖ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి మూడు సార్లు సమన్లు పంపినా ధోనీ హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

  • Loading...

More Telugu News