: 'బ్రిక్స్' దేశాధినేతల నడుమ పట్టు నిరూపించుకున్న మోడీ


భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిక్స్ దేశాధినేతల నడుమ తన పట్టు నిరూపించుకున్నారు. బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు ప్రధాన అజెండాగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ బ్యాంకుకు మోడీ సూచించిన పేరునే ఖరారు చేయడం విశేషం. ఇకపై, బ్రిక్స్ దేశాల అభివృద్ధి కోసం తోడ్పడే ఈ నూతన బ్యాంకుకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్ డీబీ) అని నామకరణం చేశారు. 100 బిలియన్ డాలర్ల ఉమ్మడి నిధితో ఈ బ్యాంకు ఏర్పాటు చేస్తారు. తొలి ఆరేళ్ళు ఈ బ్యాంకు చైనా, భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఐదేళ్ళు బ్రెజిల్, ఆ తర్వాత ఐదేళ్ళు రష్యా నుంచి ఈ బ్యాంకు వ్యవహారాలు కొనసాగుతాయి.

  • Loading...

More Telugu News