: స్పీడ్ పోస్టులో కాశీ విశ్వనాథుడి ప్రసాదం


కాశీ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి గంగలో మునిగి, కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడం మోక్షదాయకమన్నది ఓ నమ్మిక. అయితే, అంతదూరం వెళ్ళాల్సి రావడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కాగా, శ్రావణ మాసం సందర్భంగా భారత పోస్టల్ డిపార్ట్ మెంట్ ఓ వినూత్న పథకం అమలుకు సన్నద్ధమైంది. ఇకపై కాశీ విశ్వనాథుడి ప్రసాదాన్ని భక్తుల ఇళ్ళకు బట్వాడా చేస్తారు. ఈ మేరకు వారణాసి దేవస్థానం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ దేవస్థానంతో తపాలా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రసాదం కోరుకునే భక్తులు రూ. 60 మనీ ఆర్డర్ రూపంలో పంపాల్సి ఉంటుంది. శ్రావణమాసం సందర్భంగా ఈ రెండు దేవాలయాలకు భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తుతారు. ఈ నేపథ్యంలోనే పోస్టల్ శాఖ తాజా ఒప్పందం కుదుర్చుకుంది.

  • Loading...

More Telugu News