: జడేజాను దూషించిన ఆండర్సన్... మెడపై నిషేధం కత్తి!
ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు సందర్భంగా రవీంద్ర జడేజాను ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ దూషించినట్టు అతడిపై టీమిండియా మేనేజ్ మెంట్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్ రెండో రోజు మైదానం నుంచి వెలుపలికి వస్తుండగా ఆండర్సన్... జడేజాను ఉద్దేశించి నోరు పారేసుకోవడంతో వివాదం మొదలైంది. దీనికి జడేజా కూడా దీటుగా బదులిచ్చినట్టు సమాచారం. దీనిపై భారత జట్టు మేనేజర్ సునీల్ దేవ్ ఫిర్యాదు చేయడంతో ఐసీసీ విచారణకు ఉపక్రమించింది. ఆండర్సన్ పై ఐసీసీ నియమావళిలోని లెవల్ 3 అభియోగాలు మోపారు. ఆండర్సన్ తప్పిదానికి పాల్పడినట్టు రుజువైతే అతనిపై 2 నుంచి 4 టెస్టులు గానీ, లేక, 4 నుంచి 8 వన్డేలు గానీ నిషేధం విధించే అవకాశం ఉంటుంది.