: సీబీఐ జేడీ పెద్ద మనసు!
అవినీతి కేసుల్లో ఎంతటివారినైనా ఉపేక్షించడని పేరున్న సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ తన పెద్ద మనసును చాటుకున్నారు. హైదరాబాదు శివారు ప్రాంతాలైన వనస్థలిపురం, హయత్ నగర్ లోని రెండు స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆయన నేడు విరాళాలు అందజేశారు. శాంతినికేతన్ కు రూ. 50 వేలు, షకీనా ఫౌండేషన్ కు రూ. లక్ష అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల ఆవరణలో జేడీ మొక్కలను నాటారు. ఫౌండేషన్లను అందించే చేయూతను వినియోగించుకుని విద్యార్థులు జీవితంలో పైకెదగాలని సూచించారు.