: 'బ్రిక్స్' సమావేశాలలో మోడీ విజయం
బ్రెజిల్ లో జరుగుతున్న 'బ్రిక్స్' దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో భారత ప్రధాని మోడీ తనదైన ముద్ర వేశారు. కొత్త 'అభివృద్ధి బ్యాంకు' ఏర్పాటు లక్ష్యంతో పావులు కదిపిన భారత్ విజయం సాధించింది. 'అభివృద్ధి బ్యాంకు'కు భారత్ చేసిన ప్రతిపాదనకు కూటమిలోని దేశాలు అంగీకరించాయి. 100 బిలియన్ డాలర్లతో దీన్ని ప్రారంభించాలని సభ్యదేశాలు నిర్ణయించాయి. ఈ బ్యాంకుపై ఏ ఒక్క దేశం ఆధిపత్యం లేకుండా ఉండాలనేది భారత్ లక్ష్యం. ఈ మేరకు భారత్ చేసిన ప్రతిపాదనకు సభ్యదేశాలు సానుకూలంగా స్పందించాయి. ఇంకా చెప్పాలంటే, సభ్యదేశాలను మోడీ ఒప్పించగలిగారు. 100 బిలియన్ డాలర్లను సభ్యదేశాలన్నీ సమానంగా భరిస్తాయి. బ్యాంకు ప్రారంభ వాటా పెట్టుబడిని 50 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. భారత ప్రధాని మోడీ పాల్గొన్న తొలి అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులోనే మన దేశానికి విజయం దక్కడం విశేషం. అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం కోసం భారత్ పోటీ పడ్డా... అది చైనాలోని షాంగైకు వెళ్లింది. అయితే, వంతులవారీగా చేపట్టే బ్యాంకు అధ్యక్ష పదవి మాత్రం భారత్ కు దక్కింది. బోర్డ్ ఆఫ్ గవర్నర్ల తొలి అధ్యక్ష పదవి రష్యాకు దక్కింది.